SRCL: శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ కు భారీగా భక్తులు తరలి రావడంతో గదుసరిపోక ఇబ్బందులు పడ్డారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు, బుధవారం రాత్రికి చేరుకున్నారు. ఆలయ గదులు, సరిపోకపోవడంతో పార్కింగ్ స్థలంలో కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటుచేసిన షామియానాలు, తాత్కాలిక పందిళ్ల కింద రాత్రి బస చేశారు.