మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ రాజీవ్ గృహకల్పలో ఇంటింటికి తడి పొడి చెత్త డబ్బాలను మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తడి చెత్తను పొడి చెత్తను వేరుగా వేసి మున్సిపల్ సిబ్బంది కృషి చేయాలని కోరారు.