KNR: వరదలు, ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడే మెలకువలే లక్ష్యంగా కరీంనగర్ ఎల్ఎండీ జలాశయంలో ‘యువ ఆపద మిత్ర’ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో వివిధ కళాశాలలకు చెందిన 150 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. వీరికి బోట్ రైడింగ్, స్విమ్మింగ్, ఫ్లోటింగ్ వంటి అంశాలపై నిపుణులు ప్రత్యక్షంగా శిక్షణ అందిచారు.