JGL: లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరిపై వెల్గటూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్మారం మండలానికి చెందిన కట్ట రమేష్, కళ్ళెం నరేందర్ అనుమతులు లేకుండా డ్రా నిర్వహిస్తూ ఒక్కో కూపన్కు రూ. 1,116 వసూలు చేసినట్లు సీఐ రాంనర్సింహారెడ్డి తెలిపారు. సమాచారం మేరకు వారిని పట్టుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.