తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా బ్యాంకులకు ఆర్బీఐ సెలవు ప్రకటించింది. రేపు 4వ శనివారం, ఎల్లుండి ఆదివారం కావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం బ్యాంకులు తెరుచుకుంటాయి. ఆన్లైన్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని బ్యాంకు అధికారులు స్పష్టం చేశారు.