HNK: పరకాల పట్టణంలోని గర్ల్స్ హై-స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్టులో గెలుపొందిన విద్యార్థులకు ఎస్సై పవన్ కుమార్ బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్ననాటి నుంచే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని ఎస్సై అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కళ్యాణ్, తదితరులు ఉన్నారు.