హైదరాబాద్ కోకాపేటలో అల్లు సినిమాస్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక్కడ ఆసియాలోనే అతి పెద్దదైన 75 అడుగుల భారీ డాల్బీ విజన్ స్క్రీన్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోనే ఇది మూడవ డాల్బీ థియేటర్. మార్చి 12న సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. మార్చి 18 నుండి ధురంధర్ 2 ప్రీమియర్ షోలతో బుకింగ్స్ షురూ అవుతాయి.