NLG: హాలియా నుంచి మల్లెమనికుంట తండాకు బైక్ పై వెళ్తున్న శ్రీకాంత్ (34) అనే వ్యక్తి కుంకుడుచెట్టు తండా సమీపంలో ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. స్థానికుల సమాచారంతో నాగార్జునసాగర్ 108 అంబులెన్స్ సిబ్బంది గోవర్ధన్, గణేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.