AP: డ్వాక్రా మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘ఉచిత బస్సుపై గొప్పలు చెప్పి పరిమితులు పెట్టారు. 50 లక్షల మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు. తల్లికి వందనంలో ఒక్కో తల్లికి రూ.17,500 ఎగనామం పెట్టారు. NDA అంటే నారా వారి డ్రామా అడ్మినిస్ట్రేషన్. కూటమి ప్రభుత్వం మహిళాద్రోహి ప్రభుత్వం’ అంటూ ధ్వజమెత్తారు.