MDK: జిల్లాలో ప్రతి ఒక్కరూ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. సోమవారం తూప్రాన్ పట్టణంలో ఛైర్ పర్సన్ రజని రాఘవేందర్ గౌడ్, ఆర్డీవో జయచంద్ర రెడ్డి, కమిషనర్ గణేష్ రెడ్డిలతో కలిసి పట్టణంలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. తడి పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించి సేకరించాలని సూచించారు.