సత్యసాయి: నియోజకవర్గాల పునర్విభజన చర్చల నేపథ్యంలో ముదిగుబ్బ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ముదిగుబ్బ మండలంలో 60 వేలకు పైగా ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. భౌగోళికంగా, జనాభా పరంగా అన్ని అర్హతలు ఉన్నందున, పునర్విభజనలో ముదిగుబ్బకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించారు.