వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య, తన తదుపరి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ H. వినోద్ దర్శకత్వంలో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినోద్ స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని జాగారం స్టూడియోస్ భారీ బడ్జెట్తో నిర్మించనున్నట్లు టాక్. ఈ వార్తతో సూర్య అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.