శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. పాతపట్నం మండలం బూరగాంలోని ఓ వీధి పెరట్లో సోమవారం సాయంత్రం పసికందు ఏడుపులు వినిపించాయి. స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా సమీపంలో ఎవరూ లేరు. ఏ తల్లో మగబిడ్డను పడేసి వెళ్లినట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో పసికందును చూసుకుంటానని చెప్పడంతో బిడ్డను ఆమెకు అప్పగించారు.