PDPL: రామగిరి మండలంలోని పన్నూర్ గ్రామ మార్కెట్ సెంటర్ ప్రాంగణంలో నూతన తహశీల్దార్ కార్యాలయ నిర్మాణ పనులకు మంగళవారం సర్పంచ్ మహేష్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. రెవెన్యూ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకే ఈ భవన నిర్మాణమని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు.