KMM: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు సీపీ సునీల్ దత్, ACP తిరుపతి రెడ్డి పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు. కుటుంబానికి పెద్దదిక్కు రోడ్డు ప్రమాదంలో కోల్పోతే ఎంత బాధాకరమో వివరించారు.