SKLM: పొందూరు మండలంలో లైదం గ్రామంలో రూ.1 కోటి 34 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లును స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. గ్రామాల్లో రహదారులు, కాలువలు వంటి మౌలిక వసతులు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.