TG: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సైదాపూర్ మండలం రోల్ మోడల్‌గా నిలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు మండల సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.