KDP: బద్వేల్ అర్బన్ పోలీసులు వైసీపీ జడ్పీటీసీ వంకెల చిన్న పోల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 15 సంవత్సరాల క్రితం చిన్న కేశంపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం విచారణ కోసం బి.కోడూరు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.