VSP: ఆసీలమెట్టలో ఇవాళ వైసీపీ దక్షిణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపలి గణేష్ కుమార్ హాజరై మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అనంతరం వారంలోగా క్యాడర్ రిజిస్ట్రేషన్ డిజిటలైజేషన్ పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.