విజయనగరం జిల్లా కాంగ్రెస్ కమిటి ఉపాధ్యాక్షులు, న్యాయవాది సయ్యద్ అబ్దుల్ కరీం ఇటీవల గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.