పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలో ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు సిద్దగోని రవి (52) ఆదివారం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి గీత కార్మికులు వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.