ELR: నూజివీడు మండలం గొడుగువారిగూడెంలో పేదల సేవలో కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారధి ఇవాళ పాల్గొన్నారు. అనంతరం పెన్షన్లను లబ్ధిదారులకు వారి ఇళ్లకు వెళ్లి అందజేసి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం పెన్షన్ల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, లబ్ధిదారులకు సకాలంలో పెన్షన్లు అందిస్తున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు.