AP: కూటమి పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసమే కనిపిస్తోందని మాజీమంత్రి శైలజానాథ్ విమర్శించారు. ‘ఏ రంగంలో చూసినా అంత విధ్వంసమేనన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మోసం చేశారు. PPP మోడ్ కింద ప్రభుత్వం ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పనంగా ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు.