SDPT: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా 99 రోజులు చురుగ్గా నిర్వహించాలని కలెక్టర్ కే.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రభావవంతంగా చెయ్యాలన్నారు.