MLG: ములుగు మండలం ఇంచర్ల గ్రామ శివారులోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల & కళాశాలను జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థుల వసతి గదులు, కిచెన్, స్టోర్రూమ్ పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వసతి గృహాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.