W.G: పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని నరసాపురం మెయిన్ కెనాల్‌పై రూ.12 కోట్లతో నిర్మించనున్న డబుల్ లైన్ బ్రిడ్జి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు.