AP: TGలో విజయ బ్రాండ్ నెయ్యి కల్తీ కాలేదని ఏపీ డైరీ పేర్కొంది. TG డైరీ డెవలప్మెంట్ ఛైర్మన్ ఆరోపణల నేపథ్యంలో శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపామని, 10 రోజుల్లో రిపోర్టులు వస్తాయని తెలిపింది. గత DEC నివేదికల్లో అంతా బాగుందని వెల్లడించింది. కేవలం లోగోపైనే ఫిర్యాదులు వచ్చాయని, టెండర్ నిబంధనలు ఉల్లంఘిస్తే రిపోర్టుల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.