AP: పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులున్నాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గత వారం రోజుల్లో 90 వేల మంది ప్రయాణించారని, అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.