NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని వన్య ప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. అడవిలో మనిషి వెళ్లలేని చోటికి డ్రోన్ కెమెరాలను కృత్రిమ మేధ (ఏఐ) స్మార్ట్ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ స్మార్ట్ కెమెరాల వల్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని గుర్తించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాయి.