VZM: ఎల్.కోట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14-15 ఏళ్ల బాలికల కోసం ఏర్పాటు చేసిన హెచ్పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్ ముప్పును నివారించడంలో ఈ టీకా రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.