హ్యుందాయ్ మోటార్ ఇండియా.. 2026 వెర్నా కారును దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.10.98 లక్షల (ఎక్స్‌షోరూమ్). 6 వేరియంట్లలో లభించే ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్సులతో జత చేసిన రెండు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. ఇది క్లాసీ బ్లూ, టైటాన్ గ్రే మాట్టే అనే రెండు రంగుల్లో లభిస్తుంది.