MULG: వెంకటాపూర్ మండలం పాలంపేట కాకతీయుల కాలం నాటి కళాఖండాలు అద్భుతంగా ఉన్నాయని మాజీ మావోయిస్టు అగ్రనేత తక్కెళ్లపల్లి వాసుదేవరావు (ఆశన్న) అన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టూరిజం గైడ్లు విజయ్ కుమార్, వెంకటేష్ వద్ద నుంచి రామప్ప దేవాలయ చరిత్ర గురించి ఆశన్న తెలుసుకున్నారు.
BDK:మణుగూరు చాకలి ఐలమ్మ నగర్ ప్రాంతానికి చెందిన రాపర్తి అనూష బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గత కొంతకాలంగా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ, చికిత్స పొందారు. రోజురోజుకు పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.
NGKL: లింగారెడ్డిపల్లిలో నేడు సామూహిక వనభోజన కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామ పెద్దల నిర్ణయం మేరకు ప్రతి కుటుంబం ఈ వేడుకలో భాగస్వాములు కావాలని పంచాయతీ కార్యాలయం కోరింది. పచ్చని చెట్ల నీడన గ్రామస్థులందరూ కలిసి వంటలు వండుకుని, సహపంక్తి భోజనాలు చేయడం ద్వారా ఐకమత్యాన్ని చాటనున్నారు. ఈ వేడుక పాత జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు మంచి వేదిక కానుంది.
GNTR: తెనాలిలోని జ్యువెలరీ షాపులో బుధవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. దుండగులు షాపు తాళాలు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించి,10 కేజీల వెండితో పాటు 10 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో టూ టౌన్ సీఐ రాములు నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ఈ చోరీకి పాల్పడ్డారు.
MBNR: జడ్చర్ల మండల కేంద్రంలోని పలు మసీదుల్లో గురువారం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పండ్లు పంపిణీ చేశారు. గత 21 సంవత్సరాలుగా ప్రతి రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు పండ్లు అందజేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. పండ్లు అందుకున్న ముస్లిం సోదరులు లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా 124 ఖాళీలు భర్తీ కానున్నాయి. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి మార్చి 15 వరకు గడువు ఉంది.
వేసవి ఎండలతో కిడ్నీలకు ముప్పు పొంచి ఉంది. తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల శరీరం చల్లబడటానికి రక్తం చర్మం వైపు మళ్లుతుంది, దీనివల్ల కిడ్నీలకు రక్తప్రసరణ తగ్గి (రీనల్ హైపోపెర్ఫ్యూజన్) అవి దెబ్బతింటాయి. డీహైడ్రేషన్‌తో విషతుల్యాలు పేరుకుపోయి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు (CKDu) దారితీయవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, ఎండలో పనిచేసేవారు, మధుమేహం ఉన్నవారు అప్రమత్తంగా ఉండి తగినంత నీరు తాగాలి.
E.G: నిడదవోలు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం వద్ద పార్టీ 16వ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు YSR విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండా ఆవిష్కరించారు. అధికారం ఉన్నా లేకున్నా వైసీపీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు. వైసీపీ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని కొనియాడారు.
ప్రకాశం: తర్లుపాడు మండలంలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కలుజువ్వలపాడు, మంగళకుంటలో ఇప్పటికే 733 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించామని MRO కిషోర్ కుమార్ తెలిపారు. మరో 1,267 ఎకరాల వరకు సేకరించాలని ప్రతిపాదనలు పంపామన్నారు. చెన్నారెడ్డిపల్లి, జగన్నాథపురంతో పాటు మరో రెండు గ్రామాల్లో భూములను సేకరించాల్సి ఉందన్నారు.
TPT: శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని M.P.Ed, B.P.Ed, D.P.Ed నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం నియంత్రణ అధికారి రాజమాణిక్యం తెలిపారు. పరీక్షలు ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్, మదనపల్లె బీటీ కళాశాలలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
KMR: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని CHCలో ఉచిత కంటి వైద్య పరీక్షలు గురువారం నిర్వహించినట్లు ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీహెచ్‌సీ పరిధిలోని రోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి పనులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్ నిమిత్తం KMR, బాన్సువాడ లైన్స్ ఐ హాస్పిటల్‌కి సిఫారసు చేయడం జరిగిందన్నారు
SRCL: ఇల్లంతకుంట మండలంలో గురువారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. వెంకటాపూర్ నుంచి జంగంరెడ్డిపల్లె వైపు విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట పొలంలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు ఉన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు.
ప్రకాశం: వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి హాజరై మాట్లాడారు. వందకు వందశాతం ప్రజలకు హామీలు నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అన్నారు.
చిత్తూరులో దొంగతనం కేసు ఛేదించారు. దుర్గానగర్ కాలనీలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. వారి నుంచి రూ. 34 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
WNP: గత ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్యే బీఫాం ఇచ్చి , వెనక్కి తీసుకున్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని మాజీ ఎమ్మెల్యే చిన్నా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు పని చేసిన కార్యకర్తలకు పదవులు ఇచ్చినప్పుడే పార్టీ పది కాలాలు అధికారంలో ఉంటుందని అన్నారు.