• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే

BDK: అశ్వారావుపేట(మం) వినాయకపురంలో పాఠశాలలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలు, తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సమస్యలను ఆయన పరిశీలించారు.

March 9, 2026 / 02:27 PM IST

ఒలింపిక్స్ లక్ష్యంగా వర్సిటీల నిర్మాణం: రేవంత్

TG: క్రీడాశాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీలో సౌకర్యాల కల్పనపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల క్రీడలపై మైదానాల ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీల నిర్మాణం జరగాలని ఆదేశించారు.

March 9, 2026 / 02:26 PM IST

గురుకుల పాఠశాల తనిఖీ

SRD: సంగారెడ్డి మండల కేంద్రమైన హత్నూర గురుకుల పాఠశాల, కేజీబీవీ పాఠశాలను సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సందర్శించారు. ఈ సందర్భంగా వంటగది, సరుకులు, స్టోర్ రూమ్, డార్మెంటరీ, డైనింగ్ హాల్, మెనూ ప్రకారం వండిన భోజనం పరిశీలించారు. ఈ మేరకు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.

March 9, 2026 / 02:25 PM IST

మతవిద్వేషాలను రెచ్చగొడితే కఠిన చర్యలు: CM

AP: శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకోనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలపై దృష్టి పెట్టాను. గత ప్రభుత్వం తిరుమల పవిత్రత దెబ్బతీసే ప్రయత్నం చేసింది. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేసి వేల మంది చనిపోయేలా చేశారు’ అని విమర్శించారు.

March 9, 2026 / 02:22 PM IST

‘ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి’

NRML: ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వారు పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను వారు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను సూచించారు.

March 9, 2026 / 02:21 PM IST

బీజేపీ రైతులకు ఉరితాడు బిగిస్తుంది: SKM

GDWL: బీజేపీ ప్రభుత్వం విదేశీ శక్తులతో ఒప్పందాలు చేసుకుంటూ మన దేశ రైతులకు ఉరితాడు బిగిస్తోంది అని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) జిల్లా అధ్యక్షుడు జి. గోపాల్ అన్నారు. సోమవారం చేనిగోనిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు రైతులతో కలిసి నిరసన నిర్వహించారు. విత్తన బిల్లు, వీబీజీ రాంజీ బిల్లులు రైతులకు శాపంగా మారాయన్నారు.

March 9, 2026 / 02:21 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో PMSMA కార్యక్రమం

PPM: సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం డా.పావని ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, మూత్ర పరీక్షలు నిర్వహించారు. సుఖ ప్రసవం, గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలను గురించి వివరించి చెప్పారు.

March 9, 2026 / 02:19 PM IST

స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

కృష్ణా: మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామంలో రూ.4.79 లక్షలతో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన స్మశాన వాటిక అభివృద్ధి పనులకు మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

March 9, 2026 / 02:18 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో MRI సేవలు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆసుపత్రిని సందర్శించి, MRI యంత్రం ఏర్పాటుకు కేటాయించిన గదులు, మౌలిక వసతులను పరిశీలించారు. పనులను వేగవంతం చేసి సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు త్వరగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

March 9, 2026 / 02:15 PM IST

ప్రజావాణికి 24 ఫిర్యాదులు

RR: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 24 ఫిర్యాదులు అందినట్లు ఆమె తెలిపారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి త్వరిత పరిష్కారం చూపాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

March 9, 2026 / 02:14 PM IST

‘నెల్లిపట్ల అటవీ ప్రాంతంలో చిరుత సంచారం’

CTR: బైరెడ్డిపల్లె మండలం నెల్లిపట్ల సమీప అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం ఓ దూడను చంపిన చిరుత ఇటీవల తరచూ పలువురు పశువుల కాపరుల కంటపడినట్లు చెబుతున్నారు. అడవిలోకి పశువులను మేతకు తీసుకెళ్లాలంటే భయపడుతున్నామన్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి గ్రామాల వైపు చిరుత రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

March 9, 2026 / 02:14 PM IST

ఆశ్రమ పాఠశాలలో “చాలీచాలని కూర”

ASR: డుంబ్రిగూడ మండలం జామగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి భోజనం, విద్యాబోధన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో సుమారు 520 మంది విద్యార్థులు ఉండగా మధ్యాహ్న భోజనానికి కేవలం 100 మందికి సరిపడా కూర మాత్రమే వడ్డిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 9, 2026 / 02:14 PM IST

గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు చర్యలు: కలెక్టర్

కోనసీమ: HPV టీకాను జిల్లాలో 14 ఏళ్లు దాటి 15 ఏళ్ల లోపు గల బాలికలకు వేయించి గర్భాశయ క్యాన్సర్‌ను దూరం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద HPV వ్యాక్సిన్ ప్రచార బ్యానర్లను ఆవిష్కరించారు. 14ఏళ్లు దాటిన ప్రతి బాలికకు వ్యాక్సినేషన్ వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

March 9, 2026 / 02:14 PM IST

‘నీటి శుద్ధి కార్యక్రమం చేపట్టాలి’

ఏలూరు: జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్ ఆధ్వర్యంలో సోమవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలుషిత తాగునీటి వల్ల వ్యాధుల వ్యాప్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఆత్యవసర నీటి శుద్ధి కార్యక్రమం చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందచేశారు.

March 9, 2026 / 02:14 PM IST

పటిష్ట బందోబస్తుతో ఇంటర్ పరీక్షలు

కడప: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు పోలీసుల పటిష్ట బందోబస్తుతో కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధిస్తూ కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రాల రవాణాకు ప్రత్యేక ఎస్కార్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

March 9, 2026 / 02:12 PM IST