NRML: ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వారు పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను వారు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను సూచించారు.