BDK: మణుగూరు మండలం రైల్వే స్టేషన్ సమీపంలోని న్యూ పద్మగూడెం గ్రామానికి చెందిన పద్దం ప్రసాద్ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పద్దం ప్రసాద్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
సత్యసాయి: పుట్టపర్తికి చెందిన ఆధ్యాత్మిక కోచ్ డా. శీలా దాస్‌గుప్తాకు బెంగళూరులో రెడ్ ఎఫ్‌ఎం 93.5 ‘ఇన్‌స్పిరేషనల్ మదర్ అండ్ చేంజ్ మేకర్ అవార్డు 2026’ లభించింది. ప్రముఖ నటి హరిప్రియ చేతుల మీదుగా సోమవారం ఆమె అవార్డు అందుకున్నారు. గత 19 ఏళ్లుగా పుట్టపర్తిలో నివసిస్తున్న ఆమె, సంగీతం, ఆధ్యాత్మిక రంగాల్లో చేసిన సేవలకు గానూ ఈ గుర్తింపు దక్కింది.
WGL: ఓరుగల్లులో కుర్చీ వేసుకుని అభివృద్ధి పనులను పూర్తి చేయిస్తానని మాజీ సీఎం కేసీఆర్ అన్నారని, ప్రస్తుతం ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విమర్శించారు. వరంగల్ కాంగ్రెస్ ఆఫీసులో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనేక అభివృద్ధి పనులను చేపట్టి ఓరుగల్లును సమగ్ర అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ స్కీమ్ లోగో డిజైన్‌పై కేంద్రం పోటీని నిర్వహిస్తోంది. లోగో డిజైనింగ్‌లో విజేతగా నిలిచిన వారికి రూ.50వేలు బహుమతిగా ఇవ్వనుంది. ఈ కంటెస్ట్‌లో పాల్గొనే వారు mygov.inలో మొబైల్ నంబర్/మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. మార్చి 20 చివరి తేదీ. కాగా, ఈ స్కీమ్‌లో పనిదినాలను 100 నుంచి 125కి పెంచారు.
SRD: సిర్గాపూర్ మండలం గైరాన్ తండా జీపీ పరిధి లోంక తాండలో సోమవారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ వినోద్ రాథోడ్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గ్రామానికి చెందిన లబ్ధిదారు నేనావత్ లక్కుబాయి సంతోష్ సొంత స్థలంలో పునాదులతో ఎందుకు కొలతల ముగ్గు వేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు సర్పంచ్ చెప్పారు. ఇందులో సెక్రెటరీ అనిల్ ఉన్నారు.
NRML: పట్టణ ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు పట్టణంలో కొత్తగా టౌన్ ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఇవాళ తెలిపారు. పాత భరోసా కేంద్రం వద్ద ఈ ఔట్‌పోస్ట్‌ను ప్రారంభించామని, కేసులు, ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
JN: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామంలో సోమవారం పర్యటించి మాట్లాడారు. నాణ్యతలో రాజీ పడకుండా ఇళ్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
MDK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా రామాయంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) ప్రాంగణంలో సోమవారం అగ్నిమాపక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది విద్యార్థులకు ప్రమాదాల పట్ల అప్రమత్తతపై పలు సూచనలు చేశారు.
KMR: నాగిరెడ్డిపేట(M) పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల పలు దశల్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. యాసంగి పంటల కోసం సోమవారం రోజు ఔట్ ఫ్లో 205 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా 28 క్యూసెక్కులు నీరు ఆవిరిగా మారుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు యాసంగికి 0.608 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. విపక్ష సభ్యులు వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం పరిస్థితులపై చర్చించనున్నారు.
KNR: హుజురాబాద్ పట్టణంలోని 17వ వార్డు మామిళ్లవాడలో సోమవారం మున్సిపల్ రెస్క్యూ టీం ఆధ్వర్యంలో వీధి కుక్కల నియంత్రణ కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ రొంటాల సుహాసిని పర్యవేక్షణలో సిబ్బంది కుక్కలను బంధించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎండీ కాలిక్ హుస్సేన్, సొల్లు సునీత, కమిషనర్ ముసబ్ అహ్మద్, మేనేజర్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
SRCL: కేంద్ర బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచి సామాన్యుడిని ఇబ్బంది పెడుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ అన్నారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఖాళీ సిలిండర్‌తో సీపీఎం నాయకులు సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచి పేదవాడి నడ్డి విరిచిందని మండిపడ్డారు. పెరిగిన ధరలను తగ్గించాలన్నారు.
HNK: కాకతీయ యూనివర్సిటీ(KU)పరిధిలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి పీజీ కోర్సులకు నూతన సిలబస్ అమలు చేయనున్నారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే. ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం మార్గదర్శకత్వంలో 23 పీజీ కోర్సుల సిలబస్ రూపకల్పన కొనసాగుతోంది. టెక్నాలజీ, ఏఐ, వాల్యూ ఎడ్యుకేషన్, నైపుణ్యాభివృద్ధి అంశాలను కోర్సుల్లో చేర్చనున్నారు.
ELR: దెందులూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. సోమవారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఆయన పలు గ్రామాలకు చెందిన ప్రజలను కలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించినట్లు పేర్కొన్నారు.
RR: చేవెళ్లలో బీసీ హక్కుల సాధన కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండల బీసీ సంఘం అధ్యక్షుడు వెంకటయ్య ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ హక్కుల కోసం ఉద్యమించాలని, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.