• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డా సేఫ్

KDP: అంబులెన్స్‌లో మహిళ ప్రసవించిన ఘటన జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బి.మఠం మండలం పలుగురాళ్లపల్లికి చెందిన గర్భిణీ అపర్ణను పోరుమామిళ్ల నుంచి ప్రొద్దుటూరు ఆసుపత్రికి అంబులెన్స్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నట్లు అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహాలక్ష్మి తెలిపారు.

March 9, 2026 / 08:00 AM IST

అన్ని కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తారు: కలెక్టర్

మన్యం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ.జీ.ఆర్.ఎస్)లో అర్జీల వివరాలు మీ కోసం వెబ్ సైట్‌లో నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్‌లో తెలుసుకోవచ్చు అని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజా సమస్యలు ప్రతి సోమవారం అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు.

March 9, 2026 / 08:00 AM IST

జిల్లాలో 14 స్కూళ్లను ఆధునికరించబోతున్నాం: మంత్రి

నెల్లూరు సిటీలోని 14 స్కూళ్లను ఆధునికీకరించనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఆధునీకరించే స్కూల్ భవనాలను 50 వేల చదరపు అడుగులకు తగ్గకుండా నిర్మిస్తామని చెప్పారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకూ ఒకేచోట చదువుకొనే అవకాశం కల్పిస్తామన్నారు. జాకీర్ హుస్సేన్ నగర్లోని అంగన్వాడీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లను ఒకే చోటకి చేరుస్తామని పేర్కొన్నారు.

March 9, 2026 / 07:57 AM IST

BIG ALERT: గ్యాస్ బుకింగ్ రూల్స్ మార్పు

గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లో మార్పు చేస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటి వరకు ఒక సిలిండర్ తీసుకున్న 15 రోజుల తర్వాతే రెండోది బుక్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే దానిని సవరిస్తూ ప్రకటన విడుదల చేశాయి. ఒక సిలిండర్ తీసుకున్నాక మరొకటి కావాలంటే 21 రోజుల గ్యాప్ ఉండాలని గ్యాస్ ఏజెన్సీలు వెల్లడించాయి.

March 9, 2026 / 07:55 AM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని C-బాబు కాలనీలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. అయన మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వంలో పేద ముస్లింల కోసం రంజాన్ తోఫా అందజేసేవారని, ప్రస్తుత కాంగ్రెస్ ముస్లింల సంక్షేమం మరచిందన్నారు.

March 9, 2026 / 07:55 AM IST

నేత కార్మికుడు ఆత్మహత్య

సిరిసిల్లలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 24వ వార్డు జయప్రకాష్ నగర్‌కు చెందిన నల్ల రామకృష్ణ (52) ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడంతో అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురయ్యాడు. దీంతో చంద్రంపేటలోనీ ఈదుల చెరువులో దూకి అత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని బయటకు తీశారు.

March 9, 2026 / 07:55 AM IST

కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి

NLR: వెంకటాచలం మండలం ఇసకపాలెం గ్రామంలోని కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి, YCP ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని పాల్గొన్నారు. ఆయన కోదండరాముని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఐకమత్యంగా దేవాలయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కాకాని అభినందించారు.

March 9, 2026 / 07:52 AM IST

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డాక్షేమం

WGL: నల్లబెల్లి(M) కొండాపురంకి చెందిన వెన్నెల మానస ఇవాళ పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే సిబ్బంది ఆమెకు డెలివరీ చేశారు. వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బందిని కుటుంబసభ్యులు అభినందించారు.

March 9, 2026 / 07:51 AM IST

ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేసిన ఎస్పీ

మార్కాపురం జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలన్నారు. నిర్లక్ష్యంగా ఆటో నడపకూడదని, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఆటోకు నంబర్ ప్లేట్ క్లియర్‌గా కనిపించేలా ఉండాలని సూచించారు

March 9, 2026 / 07:49 AM IST

త్వరలో 360KM RRR భాగం పనులు షురూ

RR: త్వరలో 360 కిలోమీటర్ల పొడవైన రీజినల్ రింగ్ రోడ్ (RRR) భాగం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. HYD నగరానికి వెలుపల ట్రాఫిక్ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా, భవిష్యత్ మార్పుల కోసం ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఇంజనీర్లు తెలిపారు. ఈ రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే పరిసర జిల్లాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగు పడనున్నాయి.

March 9, 2026 / 07:48 AM IST

T20 WC: భారత్ తిరగరాసిన రికార్డులు(1/2)

➤ 3 ట్రోఫీలు గెలిచిన తొలి జట్టు(2007, 2024, 2026)➤ వరుసగా రెండో ట్రోఫీ సాధించిన టీమ్(2024, 2026)➤ స్వదేశంలో టైటిల్ నెగ్గిన ఏకైక జట్టు(2026)➤ ఫుల్ మెంబర్ జట్టుపై తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్ 127/1➤ నాకౌట్స్‌లో వేగంగా 7.2 ఓవర్లలో 100 రన్స్➤ పవర్ ప్లేలో అత్యధిక రన్స్ 92/0.

March 9, 2026 / 07:47 AM IST

మహిళా జాతీయ సదస్సుకు సర్పంచ్ పైడి లక్ష్మీ

SKLM: ఆమదాలవలస మండలం వంజంగి పేట గ్రామ సర్పంచ్ పైడి లక్ష్మీకి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ మహిళా సదస్సుకు ఆహ్వానం లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 11న ఢిల్లీలో పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని తనకు ఆహ్వానం అందినట్లు సర్పంచ్ పైడి లక్ష్మీ ఆదివారం తెలిపారు.

March 9, 2026 / 07:47 AM IST

T20 WC: భారత్ తిరగరాసిన రికార్డులు(2/2)

➤ టాప్-3 బ్యాటర్లు(శాంసన్, అభిషేక్, ఇషాన్) హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి➤ తొలి వికెట్‌కు 50+ స్కోర్(98) చేసిన ఏకైక టీమ్➤ ఫైనల్‌లో అత్యధిక బౌండరీలు 37➤ T20ల్లో అత్యధికంగా 7 సార్లు 250+ స్కోర్➤ ఒకే టోర్నీలో అత్యధికంగా 3 సార్లు 250+ స్కోర్.

March 9, 2026 / 07:47 AM IST

పెద్దదేవులపల్లిలో ముస్లింలకు ఇఫ్తార్ విందు

NLG: పెద్దదేవులపల్లిలో ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లిం సోదరులకు సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ మహేష్, వార్డు సభ్యులు కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక అని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపవాస దీక్షలో పాల్గొన్న ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

March 9, 2026 / 07:47 AM IST

ప్రతి కరెంట్ స్తంభానికి ‘యూనిక్’ నెంబర్: ఎస్ఈ

KMM: జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి జీఐఎస్ మ్యాపింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. 33 కేవీ లైన్లలో 55 ఫీడర్లు, 11 కేవీ లైన్లలో 545 ఫీడర్లకు యూనిక్ పోల్ నెంబర్లు కేటాయించారు. దీనివల్ల సమస్యలు వచ్చినప్పుడు పోల్ నెంబర్ ద్వారా లొకేషన్ గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయవచ్చని వివరించారు.

March 9, 2026 / 07:46 AM IST