సిరిసిల్లలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 24వ వార్డు జయప్రకాష్ నగర్‌కు చెందిన నల్ల రామకృష్ణ (52) ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడంతో అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురయ్యాడు. దీంతో చంద్రంపేటలోనీ ఈదుల చెరువులో దూకి అత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని బయటకు తీశారు.