KMR: బీబీపేట మండలంలోని రైతుల కోసం ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతులపై నేడు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు బీబీపేట రైతు వేదికలో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. మండలంలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారి కోరారు.