JN: పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రారంభించారు. పశుసంవర్ధక రంగం రైతులకు ముఖ్యమైన ఆదాయ వనరుగా మారిందని, పాడి రైతులు తప్పనిసరిగా పశువులకు టీకాలను వేయించాలని, ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.