NDL: డోన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీడీపీలో భారీ చేరికలు జరిగాయి. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్యాపిలి మండలం నేరేడుచర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, రాచర్ల రామచంద్రరెడ్డి తదితరులతో కలిసి సుమారు 30 కుటుంబాలు ఇవాళ వైసీపీని వదిలి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి వారికి పార్టీ కండువులు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.