KDP: ఆకివీడులో వంటగ్యాస్ ధరలు చిరు వ్యాపారులకు గుదిబండగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడంతో గృహ వినియోగ గ్యాస్‌ను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు వాపోతున్నారు. పానీపూరి వంటి చిన్న వ్యాపారాలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారమైన ధరలతో వ్యాపారాలు చేయలేక స్వస్తి పలుకుతున్నామని చిరు వ్యాపారులు వాపోతున్నారు.