NRPT: టీ 20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ పై భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించడం పట్ల రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం భారత క్రికెట్ జట్టు సమిష్టి కృషి, పట్టుదల, క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
E.G: లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో వెలసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. పాల కావడి ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పురవీధుల్లో కావడితో ఊరేగింపు నిర్వహించి, అనంతరం స్వామివారికి లక్ష బిల్వార్చన, నక్షత్ర హారతి ఇచ్చారు. సాయంత్రం హోమాలు, పూర్ణాహుతితో వేడుకలు ముగిశాయి.
PLD: వినుకొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హాజరయ్యారు. మహిళల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
BDK: అశ్వరావుపేట మండలం దురదపాడు గ్రామ శివారులో కోడిపందేలు ఆడుతున్న స్థావరంపై ఇవాళ తెల్లవారుజామున పోలీసులు మెరుపు దాడి చేశారు. రహస్య సమాచారంతో దాడులు నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై యయాతి రాజు తెలిపారు. వారి నుంచి రూ. 15,080 నగదు, 2 కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
HYD: నగరంలో కల్తీ దందాను అరికట్టేందుకు సీపీ వీసీ సజ్జనార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు ఎస్సైలు, 25 మంది కానిస్టేబుళ్లతో ‘యాంటీ ఫుడ్ అడల్టేషన్ టీమ్’ను ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా 7 ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో రూ. 4 కోట్ల విలువైన కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకుని, 10 మందిపై కేసులు నమోదు చేశారు.
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు తప్పిపోయినట్లు తల్లి యశోద ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్సై అనిల్ కుమార్ తక్షణమే చర్యలు చేపట్టి గంటల వ్యవధిలోనే బాలుడిని గుర్తించి తల్లి చెంతకు చేర్చారు. వెంటనే స్పందించిన పోలీసులకు యశోద కృతజ్ఞతలు తెలిపారు.
MLG: టీ20 వరల్డ్ కప్ 2026ను గెలిచిన భారత జట్టుకు రాష్ట్ర మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఈ విజయం యువతకు స్ఫూర్తినిచ్చేదిగా నిలుస్తుందని, క్రమశిక్షణ, జట్టు భావనతో ప్రపంచ స్థాయి విజయాలు సాధ్యమని నిరూపించారని పేర్కొన్నారు. సమిష్టి కృషి, పట్టుదలతో న్యూజిలాండ్‌పై ఫైనల్‌లో అద్భుత ఆటతీరు చూపారని కొనియాడారు.
ADB: టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టుపై అద్భుత విజయం సాధించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి క్రికెట్ అభిమానులు సంబరాలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు చేపట్టారు. జాతీయ జెండా పట్టుకొని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో హోరెత్తించారు.
MDK: రేగోడ్ మండలం ఆర్.ఇటిక్యాలలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల నివాస కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వినోద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
MDCL: జిల్లాలో వ్యవసాయ విస్తీర్ణం తక్కువగానే ఉన్నప్పటికీ పంట మార్పిడి, భూసార పరీక్షల పై రైతుల్లో అవగాహన అంతంత మాత్రంగానే ఉంది. భూమి సారాన్ని కాపాడుకోవడం, దిగుబడులు పెంచుకోవడం కోసం ఈ విధానాలు ఎంతో కీలకమని నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులకు భూసార పరీక్షలు చేయించాలన్నారు.
WGL: రాయపర్తి మండలంలో గ్రామాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ చెత్తను ఇంటి వద్దే వర్గీకరించాలని ఎంపీవో కూచన ప్రకాష్ సూచించారు. ఆదివారం కాట్రపల్లి, కొలన్ పల్లి, కొత్తూరు గ్రామాల్లో పర్యటించి పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. తడి చెత్తను ఆకుపచ్చ బుట్టలో, పొడి చెత్తను నీలం బుట్టలో వేయాలని గ్రామస్తులకు వివరించారు. పారిశుధ్య నిబంధనలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.
KRNL: సార్వత్రికి ఎన్నికల్లో కురువలు పోటీ చేయాలని, వారికి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని ఎంపీ బస్తిపాడు నాగరాజు తెలిపారు. ఆదివారం గోనెగండ్ల మండల అల్వాల గ్రామంలో దేవర ఉత్సవంలో పాల్గొన్నారు. కూటమి సారధ్యంలో సీఎం చంద్రబాబు కురువలకు పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు.
విజయనగరం: ప్రజా సేవలో నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యే బేబినాయన సాధారణ వ్యక్తిలా హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేశారు. వివిధ కార్యక్రమాలకు వెళ్లే బేబినాయన బొబ్బిలి కోర్టు జంక్షన్లో ఉన్న ఓ హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేయడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. రాజుల కుటుంబానికి చెందిన బేబినాయన హంగు, ఆర్భాటం లేకుండా జీవనం సాగిస్తున్నారని ప్రజలు అంటున్నారు.
NZB: ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిజామాబాద్ జిల్లా అథ్లెట్లు మెడల్స్ సాధించారు. థాయిలాండ్‌లో జరిగిన ఈ పోటీల్లో జిల్లా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న గోపి 110 మీటర్ల హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్, ట్రిపుల్ జంప్, 4×100, 4×400 రిలేలో 3 సిల్వర్ మెడల్స్ సాధించారు. రఘువీర్ హ్యమర్‌లో సిల్వర్ మెడల్, షాట్ పుట్‌లో బ్రాంజ్ మెడల్ గెలుపొందారు.
అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమస్యలపై వినతులు స్వీకరించారు. అర్జీదారులతో మాట్లాడారు. పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.