• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి’

నంద్యాల: జిల్లా వ్యాప్తంగా 5,537 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నట్లు జిల్లా హౌసింగ్ పీడీ హరి గోపాల్ వెల్లడించారు. శుక్రవారం చాగలమర్రి మండలం చాకరాజువేముల గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 32,087 ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఉగాది లోపు మిగిలిన ఇళ్లను పూర్తి చేయడానికి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

March 7, 2026 / 07:46 AM IST

అభివృద్ధి పనుల పురోగతిపై అధికారుల సమీక్ష

JGL: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాగేశ్వర్ రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు సమీక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.

March 7, 2026 / 07:44 AM IST

‘కథను మానభంగం చేశారు’.. రచయిత సంచలన పోస్ట్

ప్రముఖ రచయిత సాయిమాధవ్‌ బుర్ర తన కథను మార్చడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నా కథతో మొదలై వేరే కథతో పూర్తయింది.. ఒక్క మాట చెప్పకుండా ఇష్టమొచ్చినట్టు మార్చేసి కథను మానభంగం చేశారు’ అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ఈ వ్యాఖ్యలు వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘ఎస్. సరస్వతి’ సినిమాను ఉద్దేశించినవేనని నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.

March 7, 2026 / 07:43 AM IST

లారీ ఢీకొని కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు

MHBD: తొర్రూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రామచందర్, మరొక హెడ్ కానిస్టేబుల్ బజ్జలాల్ గురువారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పట్టణ శివారులో లారీ ఢీకొనడంతో కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. లారీని స్వాధీనం చేసుకొని డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.

March 7, 2026 / 07:42 AM IST

‘ఆసుపత్రులలో తక్షణమే భద్రత తనిఖీలు నిర్వహించాలి’

PPM: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగుల భద్రత, అగ్నిమాపక, విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (DSH) పరిధిలో ఉన్న ఏడు ఆసుపత్రులలో తక్షణమే సమగ్ర సేఫ్టీ ఆడిట్( భద్రత తనిఖీలు) నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

March 7, 2026 / 07:41 AM IST

నేడు ఢిల్లీకి CM చంద్రబాబు

AP: CM చంద్రబాబు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. భారత్ మండపంలో దాదాపు 110 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులతో జరిగే ‘రైసినా డైలాడ్-2026’లో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘సాంకేతికత-సుపరిపాలన-భవిష్యత్’ అంశంపై చంద్రబాబు కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాలు, డిజిటల్ పౌర సేవలు సహా పలు అంశాలను వివరించనున్నారు.

March 7, 2026 / 07:40 AM IST

ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

ప్రకాశం: కంభంలోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. మనస్థాపానికి గురై, ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి లొకేషన్ ను గుర్తించి, సరైన సమయానికి అక్కడికి చేరుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని ఎస్సై శివకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి కాపాడారు. అనంతరం ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

March 7, 2026 / 07:38 AM IST

లింగాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

KDP: లింగాలలో నూతనంగా నిర్మించిన లింగాల పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం సాయంత్రం ఎస్పీ నచికేత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పులివెందుల డీఎస్పీ మురళి నాయక్‌కు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన పులివెందుల సబ్ డివిజన్‌లోని పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా విధులు నిర్వహించాలని, నేరాలు నిరోధించేందుకు పెట్రోలింగ్ చేయాలన్నారు.

March 7, 2026 / 07:35 AM IST

పాత వాహనదారులకు ALERT

TG: పాత వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులో వాహనదారులు ముందుగా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. తర్వాత వాహనాన్ని టెస్టింగ్ స్టేషన్‌కు తీసుకెళ్లాలి. అక్కడ అన్ని పరీక్షల్లో వాహనం సరైన ప్రమాణాలు కలిగి ఉందని తేలితే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.

March 7, 2026 / 07:35 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష

KRNL: మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. కౌతాళంలోని NTR నగర్‌కు చెందిన గోవిందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆదోని కోర్టు శుక్రవారం 7 రోజులు జైలు శిక్ష విధించిందన్నారు. ఇటీవల మద్యం తాగి ఆటో నడిపడంతో అదుపులో తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఆదోని ఫస్ట్ అడిషనల్ జడ్జి సాయి సుభాష్ అతడికి 7 రోజులు శిక్ష విధించినట్లు తెలిపారు.

March 7, 2026 / 07:34 AM IST

కూటమిగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: చంద్రబాబు

AP: ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి కానీ భావోద్వేగాలతో సమస్యలు సృష్టించవద్దని కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలకు CM చంద్రబాబు సూచించారు. సొంత సామర్థ్యంతో గెలవలేదని గుర్తుంచుకోవాలని.. సమస్యలపై తనను లేదా Dy.CM పవన్‌ను సంప్రదించమన్నారు. తనపై, పవన్‌పై, PM మోదీపై ప్రజల నమ్మకంతోనే 94% సీట్లు గెలిచామని.. ఈ కూటమి ప్రభుత్వం కొనసాగితేనే రాష్ట్రాభివృద్ధి అని స్పష్టంచేశారు.

March 7, 2026 / 07:34 AM IST

మిషన్ మోడ్‌లో ‘ప్రజా పాలన’ : కలెక్టర్ చిత్రా మిశ్రా

KNR: కరీంనగర్ జిల్లాలో మిషన్ మోడ్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో 99 రోజులపాటు చేపట్టనున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై జిల్లా కలెక్టర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన పవర్ ప్రజెంటేషన్ ఆకట్టుకుంది.

March 7, 2026 / 07:34 AM IST

త్వరలో ‘డిజి-లక్ష్మి’ కియోస్క్‌లు

VSP: పేద, మధ్యతరగతి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘డిజి-లక్ష్మి’ పథకాన్ని విశాఖ నగరంలో అమలు చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. జీవీఎంసీ పరిధిలో తొలి దశలో 800 మంది మహిళలు దరఖాస్తు చేశారు. ఈ పథకం ద్వారా నగరంలో సుమారు 600 డిజి-లక్ష్మి కియోస్క్‌లు ఏర్పాటు చేసి 250 రకాల డిజిటల్ సేవలను అందించనున్నారు.

March 7, 2026 / 07:32 AM IST

సీఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు

NLR: బుచ్చి నూతన సీఐగా మాతంగి శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తుళ్లూరు టూ టౌన్లో విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. శాంతిభద్రతలు మెరుగయ్యేలా తన వంతు కృషి చేస్తానని నూతన సీఐ తెలిపారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రెడ్డి బదిలీ అయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐకి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

March 7, 2026 / 07:30 AM IST

న్యూజిలాండ్‌తో ఫైనల్.. అభిషేక్‌ను తప్పిస్తారా?

T20 WCలో టీమిండియాకు బలంగా మారతాడనుకున్న అభిషేక్ శర్మ.. పెద్ద తలనొప్పిగా మారాడు. పసికూన జింబాబ్వేపై 55 మినహా.. ప్రదర్శన అంతా పేలవం. పదేపదే ప్రత్యర్థి వ్యూహానికి దొరికిపోతున్నాడు. దీంతో రేపు న్యూజిలాండ్‌తో జరిగే టైటిల్ పోరు నుంచి అతణ్ని తప్పించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే రింకూ కూడా రాణించలేకపోతుండటంతో ఫైనల్‌లో అభిషేక్‌నే ఆడించే అవకాశాలు ఎక్కువ.

March 7, 2026 / 07:30 AM IST