JGL: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాగేశ్వర్ రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు సమీక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.