నిర్మల్ పట్టణ మండలం కంచరోని చెరువు శిఖం భూముల్లో జరిగిన ఆక్రమణలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు శుక్రవారం తొలగించారు. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఫ్లాట్లు ఏర్పాటు చేసి విక్రయించేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న అధికారులు ప్రదేశానికి చేరుకుని మొరం తొలగించి ఆక్రమణలను క్లియర్ చేశారు.
ADB: గాదిగూడ మండల కేంద్రంలో శుక్రవారం ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్ చలి వేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే ప్రజల దాహాన్ని తీర్చేందుకే దీన్ని ఏర్పాటు చేశామన్నారు. ఉచితంగా అందించే స్వచ్ఛమైన నీటిని ప్రజలు స్వీకరించాలని పేర్కొన్నారు.
KNR: శాతవాహన వర్సిటీ పీహెచ్ఎ ప్రవేశాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్లకు ప్రత్యేక కోటా కేటాయించాలని టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కడారు సురేందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం వర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి, సంఘ బాధ్యులు డాక్టర్ టీ. శ్రీనివాస్ పాల్గొన్నారు.
BPT: ప్రతి సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని ఈ నెల 9న చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.
శర్వానంద్ బర్త్‌డే సందర్భంగా ‘భోగి’ చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి శర్వానంద్ మాస్ లుక్ ఉన్న పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గడ్డం, చెదిరిన జుట్టుతో శర్వానంద్ చాలా ఇంటెన్స్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. అనుపమ, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
NLG: చిట్యాల మండలం, పెద్దకాపర్తి జి.ప.ఉన్నత పాఠశాలకు CSR కింద రూ. 2.20 లక్షల విలువైన ఫర్నీచర్ అందించిన క్యూరియా సంస్థ ప్రతినిధులను ఇవాళ పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ విరాళం అందడంలో కీలక పాత్ర పోషించిన పూర్వ విద్యార్థి, శాస్త్రవేత్త డా. ఆవుల రాఘవేందర్‌ను గ్రామస్తులు అభినందించారు. విద్యార్థులు లక్ష్యంతో చదివి విజయం సాధించాలని రాఘవేందర్ కోరారు.
నంద్యాల: నిషేధిత వస్తువులను శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్‌వో శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆలయ సమీపంలోని టోల్ గేట్ వద్ద వాహనాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఎటువంటి మత్తు పదార్థాలను తీసుకు రావద్దని సూచించారు. ఆలయ ప్రాంగణంలోకి అన్యమత ప్రచార వస్తువులను తీసుకువస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
SRPT: ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత, కమిషనర్ హనుమంతరెడ్డి కోరారు. శుక్రవారం సూర్యాపేట 42వ వార్డులో జరిగిన ‘ప్రజాపాలన-ప్రగతి పాలన’లో వారు పాల్గొన్నారు. చెత్తను రోడ్లు, డ్రైనేజీల్లో వేయడం వల్ల రోగాలు వస్తాయని, పరిశుభ్రత పాటించి వర్మి కంపోస్టును వినియోగించాలని సూచించారు.
PPM: జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన క్యాటగిరీ-5, క్యాటగిరీ-6 మొబైల్ టవర్ల నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో బి.ఎస్.ఎన్.ఎల్.అధికారులు, ఏడీఈలతో జిల్లాలో టవర్ల ఏర్పాటు పురోగతిపై ఆయన సమీక్షించారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలలో భాగంగా ‘ఎదుర్కోలు’ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వధువు, వరుల ఉత్సవ విగ్రహాలను ప్రధాన ఆలయం నుంచి కళ్యాణ వేదిక వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆలయం తరఫున ఈవో రమాదేవి, మున్సిపాలిటీ తరఫున ఛైర్మన్ రాజు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను రానున్న డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కనిగిరి సుందరయ్య భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 1000 వరకు ఖాళీలు ఉన్నప్పటికీ గతంలో కేవలం 120 ఎస్‌జీటీ పోస్టులు మాత్రమే విడుదల చేశారని విమర్శించారు.
BHNG: రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవాధ్యక్షులు రెబ్బాసు రాములు ఆధ్వర్యంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటే రమేష్‌లను ఘనంగా సన్మానించారు. 1952 నుండి 2009 వరకు నియోజకవర్గంగా ఉన్న రామన్నపేటను పునర్విభజనలో నకిరేకల్‌లో కలిపారని, తిరిగి ప్రత్యేక నియోజకవర్గంగా మార్చాలని రాములు కోరారు. ఈ మేరకు సర్పంచ్ మద్దతు కోరారు.
WNP: కొత్తకోట మండలంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలోని వంట గదిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆహారాన్ని తప్పనిసరిగా గ్యాస్ స్టవ్ పై మాత్రమే వండాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఆహారం విద్యార్థులకు వడ్డించే ముందు సూపర్వైజర్ తప్పనిసరిగా రుచి చూసి తర్వాతనే అందించాలన్నారు.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పారామెడికల్ పోస్టులకు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను విడుదల చేసింది. ఈ పరీక్షలు మార్చి 11, 12, 13 తేదీలలో జరగనున్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పరీక్షలు నేటి నుండి మార్చి 13 వరకు జరగనున్నాయి. అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని బోర్డు సూచించింది.
SRD: వట్పల్లి మండలం పోతులబోగూడ మోడల్ స్కూల్ విద్యార్థి సాయికృష్ణ రూపొందించిన వినూత్న హెల్మెట్ జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. బైక్ వెనుక కూర్చున్న వారు మాట్లాడే మాటలు స్పష్టంగా వినిపించేలా ‘మాగ్నిఫర్వర్’ సాంకేతికతతో దీన్ని తయారు చేశారు. ఈ ఆవిష్కరణతో వాహనదారులు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదని,తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సాయి వివరించారు.