• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మంగంపేట కాలుష్యంపై సీపీఐ నిరసన

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలం మంగంపేట బేరైటీస్ గనుల నుంచి వస్తున్న దుమ్ము, ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మవరం క్రాస్ వద్ద మండల కార్యదర్శి నాగమ్మ ఆధ్వర్యంలో కార్యకర్తలు చీపుర్లతో రోడ్డు ఊడుస్తూ రాస్తారోకో నిర్వహించారు. కాలుష్యాన్ని వెంటనే అరికట్టాలని, రోడ్లపై నీళ్లు చల్లాలని డిమాండ్ చేశారు.

March 6, 2026 / 04:01 PM IST

ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు మార్గాల్లో ఎలక్ట్రానిక్ బస్సులు

కర్నూలు: కాలుష్యం నియంత్రణ లక్ష్యంగా జిల్లాకు తొలిదశలో 50 విద్యుత్తు బస్సులను ఆర్టీసీ కేటాయించింది. వీటిని కర్నూలు, ఎమ్మిగనూరు మార్గాల్లో నడపనున్నారు. ఇందుకోసం రూ.10 కోట్లతో కర్నూలు-2, ఆదోని డిపోల్లో ఛార్జింగ్ కేంద్రాలు , ప్రత్యేక వర్క్ షాపులు అభివృద్ధి చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కి. మీ వరకు ప్రయాణించేలా తయారుచేశారు.

March 6, 2026 / 04:01 PM IST

ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షకు 97.92 శాతం హాజరు

కామారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 97.92 శాతం హాజరు నమోదైనట్లు నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 6,585 మంది విద్యార్థులకు గాను 6,448 మంది హాజరయ్యారని, 137 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు.

March 6, 2026 / 04:01 PM IST

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం…

SDPT: చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన ఇరువురు కమ్మరి నర్సయ్య, వైనాల భూమవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5వేల చొప్పున ఆర్థిక సాయం పంపించగా శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులకు స్థానిక నాయకులు అందజేశారు.

March 6, 2026 / 04:01 PM IST

ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్, మేయర్

WGL: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం నగరంలో వేగంగా అమలవుతోంది. ఇందులో భాగంగా GWMC కార్యాలయం వద్ద స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA నాయిని రాజేందర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

March 6, 2026 / 04:00 PM IST

ఇన్‌సర్వీస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం

భూపాలపల్లిలో 2025-2026 సంవత్సరానికి అప్రెంటిస్ శిక్షణకు ఇన్‌సర్వీస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్. జుమ్లా నాయక్ తెలిపారు. సంబంధిత వృత్తిలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉన్న, GPF/EPF/ESI కలిగి పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇన్‌సర్వీస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు వరంగల్ ITIను సంప్రదించాలన్నారు.

March 6, 2026 / 04:00 PM IST

R&B రహదారుల నిర్మాణం తక్షణమే చేపట్టాలి: MLA

E.G: మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా R&B రహదారులను తక్షణమే నిర్మించాలని ఇందుకు సంబంధించి నిధులు తక్షణమే విడుదల చేయాలని ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. 2014- 2019 సమయంలో  నియోజవర్గంలో రహదారులన్నిటికీ స్వర్ణయోగం అని పేర్కొన్నారు.

March 6, 2026 / 04:00 PM IST

కదిరి బస్టాండ్‌లో ముగ్గురు మహిళా దొంగల అరెస్ట్

సత్యసాయి: కదిరి ఆర్టీసీ బస్టాండ్‌లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్పీ ఆదేశాలతో నిఘా పెంచిన పోలీసులు.. గాలింపు చేపట్టి మల్లెల గంగా, దేవరకొండ అంజలి, కాల్వపల్లి భూదేవిలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ.5.65 లక్షల విలువైన 59.5 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.75 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

March 6, 2026 / 04:00 PM IST

ఉపాధి హామీ పరిరక్షణ కోసం ఉద్యమించాలి: పొంగులేటి

KMM: జాతీయ ఉపాధి హామీ పరిరక్షణ కోసం అఖిలభారత అసంఘటిత కార్మికుల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమం అభినందనీయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాంజీ బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ ఉపాధి హామీ పథకంపై రూపొందించిన వాల్ పోస్టర్లను శుక్రవారం మంత్రి ఖమ్మంలో ఆవిష్కరించారు. కేంద్రంలో ఉన్న BJP ప్రభుత్వం పేదోడి పొట్టకొట్టే విధానాలను అవలంబిస్తుందన్నారు.

March 6, 2026 / 04:00 PM IST

వేం నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నాగపూర్ కిరణ్ కుమార్

JN: రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్న వేం నరేందర్ రెడ్డిని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నాగపురి కిరణ్ కుమార్ శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనగామలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారితో కాసేపు చర్చించారు. ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

March 6, 2026 / 04:00 PM IST

రాష్ట్ర అభివృద్ధి దిశగా మంత్రి పొంగులేటి నిర్ణయాలు

BDK: ఇల్లందు పురపాలక ఛైర్ పర్సన్ శ్రీమతి దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముందుగా మంత్రికి పుష్పగుచ్చం, శాలువాతో సత్కరించి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి దిశగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటున్న ధైర్యమైన నిర్ణయాలు ప్రజలలో నూతన నమ్మకాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు.

March 6, 2026 / 04:00 PM IST

చేవెళ్ల ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలి: DSFI

MHBD: మరిపెడ(M) కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో DSFI జాతీయ అధ్యక్షుడు డా. వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం లంబాడీ సమాజానికి మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా మోసం చేసిందని విమర్శించారు. CM స్పందించి చేవెళ్ల లో ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

March 6, 2026 / 04:00 PM IST

MPDO కార్యాలయాన్ని సందర్శించిన జడ్పీ సీఈవో

HNK: నడికూడ ఎంపీడీవో కార్యాలయాన్ని జెడ్పీ సీఈవో శేషాద్రి సందర్శించి కార్యాలయ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి అధికారులకు పలు సూచనలను చేశారు. అనంతరం ఈజిఎస్ సిబ్బందితో సమావేశమై ఉపాధి హామీ పనుల అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. తొలిసారిగా ఎంపీడీవో కార్యాలయానికి విచ్చేసిన సీఈవోను అధికారులు సన్మానించారు. ఎంపీడీవో రామకృష్ణ, MEO హనుమంతరావు, APO విద్యావతి ఉన్నారు.

March 6, 2026 / 04:00 PM IST

‘రాష్ట్ర ప్రభుత్వం కొత్త దశలో ప్రగతి వైపు అడుగులు వేస్తుంది’

WNP: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశుభ్రత, ఆరోగ్యం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ప్రగతి వైపు అడుగులు వేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఆయన హాజరై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారన్నారు.

March 6, 2026 / 04:00 PM IST

సమస్యలను అడిగి తెలుసుకున్న మేయర్

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ ‘ఇంటింటికి మీ మేయర్’ కార్యక్రమంలో భాగంగా 53వ డివిజన్ వెంకటేశ్వరపురంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను మేయర్ ఆదేశించారు.

March 6, 2026 / 04:00 PM IST