GDWL: మల్దకల్ మండల పరిధిలోని మద్దెలబండ, చిన్న తండా పరిసరాల్లో గత రెండు రోజులుగా పులి సంచరిస్తుందని స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఊరగట్టు పిల్లగుంట్ల ప్రాంతంలో ఒక గేదె, ఆవు దూడపై పులి దాడి చేసినట్లు బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున దూడపై దాడి చేసిందని తెలిపారు.
VZM: కండ్లకలకను నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డా కె.త్రినాథరావు సూచించారు. కండ్లకలక, ఇతర కంటి వ్యాధులు సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. కళ్ళు ఎర్రబారడం, దురద లేదా నీరు కారడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించాలన్నారు.
కర్నూలు: కోరువ సంఘం పెద్దల ఆహ్వానం మేరకు మండల కేంద్రమైన కౌతాళంలోని శివప్ప నగర్‌లో ఎరుకల కుల దైవం కోరువ అంజమ్మ నూతన విగ్రహ ప్రతిష్ఠ శుక్రవారం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉరుకుంద ఈరన్న మాజీ ట్రస్ట్ ఛైర్మన్ చెన్న బసప్పను కోరువ సంఘం పెద్దలు శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మంజునాథ, ఉమేశ్ గౌడ్, సిద్దు, చంద్రశేఖర్, పాల్గొన్నారు.
MBNR: జిల్లాలో నూతన కలెక్టర్‌గా కుష్బూ గుప్తా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మేయర్ మమత కలెక్టర్ కార్యాలయంలో కుష్బూ గుప్తాని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
CTR: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన గుడిపల్లె సబ్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప(43) కాంట్రాక్ట్ ఉద్యోగిగా సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం సబ్ స్టేషన్‌లో విద్యుత్ షిఫ్ట్ మార్చే క్రమంలో షాక్ తగిలి చనిపోయాడు.
MDCL: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ బెల్ట్ షాపులపై అల్వాల్ పోలీసులు దాడులు నిర్వహించారు. వెంకటాపురం హరిజన బస్తీ, హస్మత్ పేటలో ఎస్సై గీతా అధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో సోంకర్ కోమల, మాయ షాపులో దాదాపు రూ.30 వేల విలువైన 200 లీటర్ల అక్రమ మద్యం పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.
SRCL: ఇల్లంతకుంట మండలంలోని రేపాక అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య కమిటీ తల్లుల నూతన కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌గా రేపాక సర్పంచ్ కాత మల్లేశం, కన్వీనర్‌గా అంగన్వాడీ టీచర్ రమ నియమితులయ్యారు. సభ్యులుగా గ్రామ కార్యదర్శి ప్రవీణ్, వీవో ఛైర్మన్ రొండ్ల స్వరూప, ఏఎన్‌ఎం జయశ్రీతో పాటు పిల్లల తల్లులను చేర్చారు. ఉప సర్పంచ్ కొదని మహేష్, పిల్లల తల్లులు ఉన్నారు.
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఈ ఆదివారం న్యూజిలాండ్‌తోT20 WC 2026 టైటిల్ పోరులో తలపడనుంది. రోహిత్ సారథ్యంలో T20 WC 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజేతగా నిలిచిన టీమిండియా.. ఇప్పుడు సూర్య కెప్టెన్సీలో ఈ టోర్నీపై కన్నేసింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌పై గెలిస్తే.. 2013-2024 మధ్య ఒక్క ICC టైటిల్ కూడా గెలవలేకపోయిన భారత్‌కు ఇది హ్యాట్రిక్ ICC టైటిల్ అవుతుంది.
అన్నమయ్య: రామపురం మండలంలోని APSWRS, కేజీబీవీ పాఠశాలలను రాష్ట్ర ఫుడ్ కమిషనర్ విజయ్ ప్రతాప్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను పరిశీలించి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో భోజన వసతులపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
TPT: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో జనరల్ కోర్సులో 8,798 మందికి గాను 8,547 మంది హాజరుకాగా 251 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 1,082 మందికి గాను 1,050 మంది హాజరై 32 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశాంతంగా జరిగాయని అధికారులు తెలిపారు.
JN: 99 రోజులపాటు నిర్వహించే ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లింగాల ఘనపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎమ్మెల్యే ప్రారంభించారు.
MNCL: ఇళ్ల పరిసరాలలో చెత్తను, పనికిరాని వస్తువులను ఉంచవద్దని దండేపల్లి మండల అధికారులు సూచించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దండేపల్లితో పాటు లింగాపూర్, తాళ్లపేట, మేదరిపేట, మామిడిపల్లి, లింగాపూర్, ద్వారక, గుడిరేవు, వెల్గనూర్ అన్ని గ్రామాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు.
ELR: ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి చేయాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జాలాది విల్సన్ బాబు అన్నారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుఖవ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
VKB: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ అన్నారు. పాత కొడంగల్ తండాకు చెందిన చిన్ని బాయి గృహ ప్రవేశానికి ఆయన హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామాల్లో ఏళ్లుగా సొంతింటిని కట్టుకోవాలన్న కలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆయన అన్నారు.
HYD: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 12 విమానాలు రద్దయ్యాయి. అదే సమయంలో గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్‌కు రావాల్సిన మరో 12 విమానాలు కూడా రద్దయ్యాయి. ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా నుంచి రావాల్సిన, వెళ్లాల్సిన విమానాలు రద్దు అయ్యాయి.