సత్యసాయి: కదిరి ఆర్టీసీ బస్టాండ్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్పీ ఆదేశాలతో నిఘా పెంచిన పోలీసులు.. గాలింపు చేపట్టి మల్లెల గంగా, దేవరకొండ అంజలి, కాల్వపల్లి భూదేవిలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ.5.65 లక్షల విలువైన 59.5 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.75 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.