WGL: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారాన్ని దరఖాస్తుదారులు సులభంగా తెలుసుకునే విధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించాల్సిందిగా మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా వచ్చే సమస్యలను వేగంగా పరిష్కరించే విధంగా సాఫ్ట్ వేర్ రూపొందించాలని అన్నారు.
సత్యసాయి: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు హిందూపురం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడిగా ఫయాజ్ భాష నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని ఆయన తెలిపారు.
NLR: కోవూరు నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శుక్రవారం కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లివాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
ATP: రాయదుర్గం నియోజకవర్గంలోని మార్కెట్ యార్డుల అభివృద్ధికి రూ. 6.50 కోట్లు మంజూరు చేసేందుకు మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అమరావతిలో మంత్రిని కలిసి నిధులపై విన్నవించారు. స్పందించిన మంత్రి వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
BDK: 10 రోజుల ప్రత్యేక డ్రైవ్‌లో శుక్రవారం దమ్మపేట పంచాయతీ పారిశుధ్య సిబ్బందితో కలిసి పాలక వర్గ సభ్యులు, కార్యదర్శి ప్రధాన సెంటర్ బాలాజీనగర్ రోడ్డుకు ఇరువైపుల చెత్తను తొలగించి శుభ్రం చేసే డ్రైవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి బండి అనంత్ కుమార్ మాట్లాడుతూ, నేటి నుండి 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
HNK: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నేటి నుంచి జూన్ 12 వరకు నాలుగు దశల్లో వైద్య శిబిరాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని HNK జిల్లా డాక్టర్ అప్పయ్య తెలిపారు. మొదటి దశలో నేటి నుంచి 31 వరకు స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
NZB: ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో కుమారుడిని గొడ్డలితో హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డబ్బుల విషయమై తండ్రి కొత్తగుళ్ల కిషన్‌కు తన కుమారుడు భాను ప్రకాశ్ (22)తో గొడవ ఏర్పడిందని పోలీసులు తెలిపారు. కోపంతో గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు చెప్పారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు పంపారు.
GNTR: అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగిన పలు కోర్సుల పరీక్షా ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసింది. పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం ఈ ఫలితాలను ప్రకటించారు. బీఏ, బీబీఏ, ఎల్ఎల్బీ, ఎంబీఏ విద్యార్థులు తమ ఫలితాలను, రీవాల్యుయేషన్ వివరాల కోసం వర్సిటీ వెబ్సైట్‌ను www.nagarjunanuniversity.ac.in సందర్శించాలని ఆయన తెలిపారు.
AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రెండో రోజు విచారణ ముగిసింది. ఐపీఎస్ సునీల్ నాయక్‌ను అధికారులు విచారించారు. 7 గంటల పాటు విచారించినట్లు విజయనగరం ఎస్పీ దామోదర్ వెల్లడించారు. రేపు మరోసారి విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎల్లుండి కూడా విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
VZM: మహిళ సాధికారిత వారోత్సవాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు మహేంద్ర ఆసుపత్రి, మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ సౌమ్యలత హాజరై, స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించారు.
ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో శ్రీ మారెమ్మ అమ్మవారిని శుక్రవారం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) దర్శించుకున్నారు. అనంతరం ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పటినుంచో శ్రీ మారెమ్మ అమ్మవారి దర్శనానికి రావాలని అనుకుంటున్నానని, ఇప్పటికి అమ్మవారి దర్శన భాగ్యం లభించిందన్నారు.
వినుకొండకు చెందిన యువకుడు నదిలోని ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. బీటెక్ విద్యార్థి గర్రె వెంకట ఈశ్వర్ సాత్విక్ (21) తుళ్లూరు పరిధిలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు శుక్రవారం స్నేహితులతో కలిసి రాయపూడి లాంచ్ రేవు వద్ద ఈతకు నదిలో దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. మత్స్యకారుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
అమెజాన్ కంపెనీ ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన తరువాత.. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా ప్రస్తుతం సంస్థ తన వ్యాపారాలలో దాదాపు 20,000 మంది ఉద్యోగులను మాత్రమే కలిగి ఉంది.
MDCL: ప్రొడెన్షియల్ బ్యాంక్ కాలనీలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు. శుక్రవారం బోయినపల్లిలోని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. కాలనీలో నివసిస్తున్న యువత, వృద్ధులు ఆరోగ్యంగా ఉండేందుకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు.
WNP: అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని MLA మేఘారెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశాలలో ఎమ్మెల్యే పాల్గొని పలు అంశాలను ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. అటవీ శాఖలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పైన, వైద్య సదుపాయాల పైన దృష్టి సారించాలన్నారు.