ప్రకాశం: కంభంలోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. మనస్థాపానికి గురై, ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి లొకేషన్ ను గుర్తించి, సరైన సమయానికి అక్కడికి చేరుకుని ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని ఎస్సై శివకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి కాపాడారు. అనంతరం ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ నిర్వహించారు.